25 Jul , 2023

మూడు రోజుల పాటు భారీ వర్షాలు !!

తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఈ వానలను ఆసరా చేసుకొని సాగును చేసుకోవాలి. వరి పంటలో చేయవలసిన పనులు: 1. వరి పంట సాగు రైతులు ఈ వానలను సద్వినియోగం చేసుకొని నాట్లు పూర్తీ చేసుకోవాలి. 2. ఈ వర్షం వరికి అనుకూలంగా ఉన్నందున ఇప్పటి వరకు మొదలుపెట్టని రైతులు దమ్ముచేసి నేరుగా స్వల్పకాలిక విత్తనాలను చల్లుకోవాలి. 3. ఉల్లికోడు మరియు మొగిపురుగు తగ్గించడానికి కార్బోఫ్యూరాన్ గుళికలను వేసుకోవాలి. 4. 40 రోజుల పంటకు మొదటి దఫా ఎరువులను వేసుకోవాలి. ఇతర పంటలలో అంతరకృషి చేసుకోవడం మరియు మురుగు నీటి కాలువలు తీసుకోవడం మంచిది.