28 Jun , 2023

మబ్బులేకుండా వాన - క్లౌడ్ సీడింగ్ పరీక్షా విజయవంతం

వర్షాలు కురవాలంటే సీజన్ రావాల్సిందే. లేదంటే అల్పపీడనాలు ఏర్పడాలి. కానీ ఇలా సీజన్ తో సంభందం లేకుండా వర్షం కురిపించవచ్చు అంటున్నారు ఐఐటీ కాన్పూర్ ఇంజనీర్లు. క్లౌడ్ సీడింగ్ కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఐఐటీ కాన్పూర్ కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగం ప్రయోగాలు చెస్తుంది. అయితే ఇటివల DGCA అనుమతులతో క్లౌడ్ సీడింగ్ ప్రయోగం నిర్వహించి విజయవంతం చేశారు. ఈ ప్రయోగంలో సిల్వర్ అయోడైడ్, డ్రై ఐస్ , సాధారణ ఉప్పు మరియు అవపాతం యోక్క సంభావ్యత పెంచే లక్ష్యంతో ఇతర మూలకాలు, రసాయన ఏజెంట్లు వినియోగించినట్లు ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ వివరించారు.