24 May , 2023

ఖరిఫ్ కాలనికి అందుబాటులో ఎరువులు, విత్తనాలు

2023-24 ఖరీప్ పంట కాలం సాగు విస్తీర్ణం గత ఏడాది సాగుతో పొల్చితే పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా. వరి సాగు తగ్గించి మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, పెసర, కంది, సోయాబిన్‌, పచ్చిరొట్ట, జొన్న, మినుము ఇతర పంటల సాగు విస్తీర్ణం పెరిగేలా చూడాలని, ఆ దిశగా రైతులను ప్రోస్తాహించాలని వ్యవసాయశాఖ యోచిస్తుంది. ఇప్పటికే వాటికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల్లో వీటిని రైతులు నేరుగా కొనుగోలు చేయొచ్చని చెప్పారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసుల సహాయంతో ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.