11 May , 2023

భూసార పరిరక్షణ ప్రభుత్వ ధ్యేయం

సాగురంగం మెరుగుపడేందుకు , భూమిలో సారం పెంచేందుకు, ఎరువుల ఖర్చులు తగ్గేందుకు ఉపయోగపడేలా తెలంగాణ సర్కారు 65 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట పైర్ల విత్తనాలను అందిస్తుంది. దాదాపు 76 కోట్ల రూపాయల విలువ చేసే లక్షణాలపై వేల క్వింటాళ్ల విత్తనాలను రైతు సేవా కేంద్రాల ద్వారా అందుబాటులో ఉంచనుంది. జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి విత్తనాలతో ప్రధాన పంటలు ఏపుగా పెరిగి, నత్రజని భాస్వరం, గంధకం వంటి ఎరువులు వాడకం తగ్గుతుంది. ప్రధాన పంటకు ముందు పచ్చిరొట్ట పైర్లను చల్లుకొని భూమిలో కలియదున్ని, సాగుఖర్చులు తగ్గించుకునేలా ప్రతీరైతు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము.