25 Apr , 2023

ఆర్బీకేల ద్వారా పచ్చిరోట్ట విత్తన పంపిణి

రైతులకు ఖరీఫ్ సాగు సాఫీగా సాగాలన్నా.. అధిక దిగుబడులు సాధించాలన్నా, మరియు చీడ పీడల నుంచి రక్షణ పొందాలంటే పచ్చిరొట్ట సాగు అత్యంత కీలకం. పంట విత్తే ముందు వీటిని పొలాల్లో చల్లి సీజన్ సమీపించి వర్షాలు కురవగానే కలియదున్నడం ద్వారా భూములు సారవంతమవుతాయి. ఈ విదంగా రైతులను ప్రోత్సహించేందుకు జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి విత్తనాలను మరియు ప్రకృతి వ్యవసాయ విధానంలో 30 రకాల విత్తనాలతో పచ్చిరొట్ట విత్తనాల కిట్ను రూపొందించి ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులోకి తెచ్చింది. రైతులు సద్వినియోగం చేసుకోగలరు.