18 Apr , 2023

మిరప విత్తన ధరలు పైపైకి

ఈ ఏడాది మిరప కాపు, మార్కెట్ ధరలతో రానున్న వర్షాకాలంలో సాగు విస్తీర్ణం పెరగనుందని అంచనా. దీంతో సీజన్ ఆరంభానికి ముందే మిరప విత్తనాలకు డిమాండ్ పెరుగుతుంది. నాణ్యమైన, మంచి విత్తన రకాలకు కిలో లక్ష ఇరవై వేల నుండి లక్షయాబై వేల వరకు పలుకుతుంది. వచ్చే నేలలో ఆరంభంలో మిరప విత్తన అమ్మకాలు జోరుకానున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌ పేరుతో విత్తన ధరల్ని రెట్టింపు చేశారు. ఇదే అదునుగా మోసాలకు తాపులేకుండా, నాసీ రకం విత్తనాలతో నష్టపోకుండా విత్తన ఎంపిక నుండే తగు జాగ్రత్తలు తీసుకొవాలి. విత్తన రకం, లెబుల్, లాట్ నెంబర్, జర్మినేషన్ శాతాలను తనికి చేసుకోని ఎంచుకొవాలి. నారు పోసుకునే ముందే రైతు స్థాయిలో విత్తన మొలక శాతాన్ని పరిక్షించుకుంటే మంచింది.