12 Apr , 2023

40 శాతం మేర పెరిగిన వ్యవసాయ ఎగుమతులు

రోజురోజుకు సాగురంగం కొత్తపుంతలు తోక్కుతున్న వేళ, నాణ్యమైన దిగుబడులతో ఎగుమతులు ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 5 సంవత్సరాల్లో (2017-2022 ) ఎగుమతులు పెరిగాయని, ఇందులో తెలంగాణ మరియు మహారాష్ట్ర ముందజలో ఉన్నాయని వెల్లడించింది. వ్యవసాయ ఎగుమతులు 2020-21లో రూ. 6,337 కోట్లుగా ఉండగా, అవి 2021-22లోదాదాపు రూ. 10,000 కోట్లకు పెరిగాయి. ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు , తృణధాన్యాలు, పత్తి, మామిడి, ద్రాక్ష, నిమ్మ, బియ్యం, సొయాబిన్, మొక్కజొన్న వంటి పంటలతో పాటు కొద్ది మొత్తంలో మాంసాన్ని కూడా ఎగుమతులు చేస్తున్నారు. సాగుకు రాయితీలు,సబ్సిడీలు, అధునాతన సాంకేతిక విధానాలు రైతుల ధరి చేరితే రానున్న 5 ఏండ్లలో మరో 35 నుంచి 40 శాతానికి ఎగుమతులు పెరగవచ్చు.