04 Apr , 2023

సౌరవిద్యుత్ కి పునాదులవుతున్ననీటి కాల్వలు

నీటి కోసం ఉపయోగపడే కాల్వలు కొత్తగా కరెంటు ఉత్పత్తికి ఉపయోగపడేలా వినూత్న ప్రయోగం చేసింది గుజరాత్ ప్రభుత్వం. గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా 532 కిమీ పొడవైన నర్మదా కాలువల నెట్‌వర్క్‌ను సోలార్ పవర్ ప్రాజెక్ట్ గా మార్చబోతున్నారు. ఈ విధానంతో నీటి ఆవిరిని నిరోధిస్తుంది, భూమి వినియోగాన్ని తగ్గిస్తుంది. అలాగే సౌర ఫలకాలు చల్లబడుతుంటాయని గ్రిడ్ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ దేశ వ్యాప్తంగా అమలు జరిగేలా చేస్తే ఇక సోలార్ కరెంటుకు భూములు వేలాదిగా దొరికినట్టే అని అందరు భావిస్తున్నారు.