29 Mar , 2023

నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట

మార్కెట్ లోకి వచ్చే నకిలీ విత్తనాలను కనిపెట్టడం రైతులకు చాలా క్లిష్టమైన పని. ఇటీవలి కేంద్ర ప్రభుత్వం మార్కెట్లో నకిలీ విత్తనాలను గుర్తించేందుకు సీడ్‌ ట్రేసబిలిటీ బార్‌కోడ్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బార్‌కోడ్‌ను రైతులు స్కాన్ చేసి అసలువో లేదా నకిలీవో గుర్తించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలను వచ్చే వానాకాలం నుండి ఈ ప్రక్రియ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. విత్తనం ఎక్కడ ఉత్పత్తి అయ్యింది, ఎక్కడ ప్యాకింగ్ జరిగింది, మార్కెట్ లోకి ఎవరు విక్రయించారు, విత్తన నాణ్యత, జన్యు స్వచ్ఛత ఇలా దాని పుట్టు పూర్వోత్తరాలు అన్నీ ఒక్క బార్ కోడును స్కాన్ చేసి రైతులు తెలుసుకోవచ్చు.