23 Mar , 2023

ఫసల్ బీమా యోజన (FBY)

ఈ పథకం కింద, రైతులు తమ పంటలకు కరువు, వరదలు, అగ్నిప్రమాదం, తుఫాను, తెగుళ్లు మరియు వ్యాధులు వంటి వివిధ నష్టాల పరిస్థితుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు బీమా కవరేజీ మరియు ఆర్థిక సహాయం అందించడానికి భారత ప్రభుత్వం 2016లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పంట నష్టపోయిన రైతులు బీమా పొందవచ్చు. దీనికి రైతులు కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరికొంత ప్రీమియం చెల్లిస్తాయి. నష్టం జరిగినప్పుడు వెంటనే బీమా కంపెనీకి లేదా సంబంధిత అధికారులకు తెలియజేయండి. మీ పంటలలో సంభవించిన నష్టాన్ని సమయ వ్యవధిలోపు క్లెయిమ్ ఫైల్ చేయండి. క్లెయిమ్ ఆమోదించబడిన తర్వాత, బీమా కంపెనీ పరిహారం మొత్తాన్ని నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు విడుదల చేస్తుంది. కావునా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని పంట నష్టం నుండి బయటపడండి.