20 Mar , 2023

వ్యవసాయంలో రోబో

ఇతర రంగాలతో పోలిస్తే టెక్నోలజి వ్యవసాయ రంగలో వెనకబడి ఉన్నప్పటికి వ్యవసాయ రంగాల్లో ఏ మాత్రం వెనకంజా వేయకుండా శాస్రవేత్తలు, విద్యావంతులు పరిశోదిస్తున్నారు. పరిశోధకుల నిరంత కృషి వలెనే డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు రిమోట్ కంట్రోల్ మరియు బ్యాటరి సాయంతో నడిచే రోబో ట్రాక్టర్ అందుబాటులోకి వచ్చింది. సరైన సమయంలో కూలిలు అందుబాటులో లేకపోవడం మరియు కూలి రేట్లు ఎక్కువ అవ్వకుండా ఖర్చు తగ్గిచుకోవడానికి ఈ రోబో ఎంతగానో సహాయపడుతుంది. ఇది బ్యాటరితో నడిచేది కావున తక్కువ ఖర్చు మరియు వేరే వారి పై ఆధారపడకుండా రైతు సొంతగా తానెగానే వాడవచ్చు. ఈ రోబో మూడు అంగుళాల లోతుకి దున్నడం, సాళ్ళ మధ్య కలుపు, పురుగు మందుల పిచికారి, విత్తనాలు మరియు నారు వేసుకోవడానికి ఉపయోగించవచ్చు. పవర్ టిల్లర్, ఎద్దుల అరక, బ్రష్ ట్రాక్టర్, స్ప్రేయర్ ద్వారా చేసే పనులన్నీ ఈ రోబో ట్రాక్టర్ చేస్తుంది. దినిని అన్ని పంటల్లోను వాడవచ్చు అని రోబో సృష్టికర్తలైన ధర్మేంద్ర మరియు త్రివిక్రం తెలియజేసారు.