17 Mar , 2023

వేసవిలో పశువులు జాగ్రత్త

వేసవిలో గత ఏడాదికన్నా వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అధిక ఉషోగ్రతలు, వేడి గాలుల వలన పాడి పశువులు ఉష్ణతాపానికి గురవుతాయి. ఈ పరిస్తితులలో యజమానులు సస్యరక్షణ చర్యలు తీసుకోని కాపడుకోవాలని పశు వైద్యాధికారులు చెబుతున్నారు. అందుకని మేతలో భాగంగా వేసవిలో సులువుగా జీర్ణమయ్యే గంజి, జావ లాంటి పదార్థాలు ఇవ్వడంతో పాటు ఎక్కువ శాతం పచ్చిమేత ఇవ్వాలి. పచ్చిగడ్డి ఉద యం, ఎండు గడ్డి రాత్రి సమయాల్లో ఇస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. మినరల్‌ మిక్చర్‌, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వడం మంచిది. పశువుల్ని మేపేందుకు ఉదయం 6 నుంచి 10గంటల వరకు సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు బయటకు పంపడం మంచిది. పశువులకు వడదెబ్బ తగలకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మేత విషయంలో పచ్చి గడ్డికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, చల్లని నీరు తాగించాలి. చల్లటి వాతావరణంలోనే మేతకు బయటకు పంపించాలి. ఈ రెండు నెలలు పశువులు, జీవాలని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది.