20 Feb , 2023

నకిలీ విత్తనాలు జాగ్రత్త రైతన్న...

నకిలీ విత్తనాలు కొంపలు ముంచుతున్నాయి .సీజన్ ప్రారంభంలో పోలిసుల ,అధికారుల నిఘా ఉంటుందని గ్రామాలకు తెలివిగా ముందే చేరవేస్తున్నారు . గ్లైసిల్ విత్తనాల అమ్మకంతో వ్యాపారస్తులు క్కోట్లు సంపాదిస్తున్నారు . రెండు రోజుల ముందు తాండూరు పోలీసులు ఐదు క్వింటల్ల పత్తి విత్తనాలను పట్టుకోవడం జరిగింది అయితే వ్యాపారస్తులు తెలివిగా కౌలుకి తీసుకోని ,కొందరు వారి ఊరిలోనే ఉండి నమ్మించి మోసం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం నకిలీ విత్తనాలు ఫెబ్రవరి ,మార్చ్ నెలలలో డంప్ చేస్తున్నారు .గత ఏడాది 60 శాతం ఇలా నకిలీ విత్తనాలు సాగు చేసి పూర్తిగా నష్టపోయారు అంటే అర్ధం చేసుకోండి. గడ్డి మోలవదు ,అధిక దిగుబడికి ఆశపడి రైతుల అమాయకానన్ని ఆసరా చేసుక్కొని ఈ విత్తనాలను అంటగడుతున్నారు.గ్లైసిల్ విత్తనాలతో పర్యావరణానికి ముప్పుతో పాటు నెల నిస్సరమవుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి.దీంతో నాలుగేళ్లగా ఇలాగె నకిలీ విత్తనా సమస్య పెరిగిపోతుంది. రైతన్న తస్మాత్ జాగ్రత్తా .....