NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
కొబ్బరికి చరిత్రలో ఎన్నడూ లేని రేటు!
ఇతర రాష్ట్రాల్లో దిగుబడి తగ్గిన కారణంగా, రాష్ట్ర కొబ్బరికి గణనీయమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొబ్బరి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.22,000 నుండి రూ.23,000 వరకు ఉంది. గతేడాది మే నెలలో ఇదే ధర కేవలం రూ.12,000 మాత్రమే ఉండేది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దాదాపు 2 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
నారుకు బదులుగా నేరుగా వరి సాగు
తాజాగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, వరి రైతులు డైరెక్ట్ సీడింగ్ విధానాన్ని ఎక్కువగా స్వీకరిస్తున్నారు. ఈ పద్ధతిలో నారును నాటకుండానే నేరుగా విత్తనాలను పొలంలో విత్తడం వల్ల నీటి వినియోగం తగ్గుతుంది. రైతులకు ఇది కార్మిక వ్యయాలను కూడా తగ్గించడంలో ఉపయోగపడుతోంది. పలు జిల్లాల్లో ఈ విధానం అనుసరించి 66 శాతం వరి సాగు ప్రారంభమైంది. సాధారణ సాగుతో పోల్చితే 10–15 శాతం ఎక్కువ దిగుబడిని అందించే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు. వర్షాలు ఆలస్యమవుతున్నా, ఈ విధానం వల్ల పంటలకు గడువు మించకుండా సాగు జరగుతుందని రైతులు ఆశిస్తున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఏపీలో పశువులకు గోధార్ కార్డులు
ఆంధ్రప్రదేశ్‌లో పశువులకు ఆధార్ తరహా ‘గోధార్’ కార్డులు అందించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. విజయవాడలో జరిగిన టెక్ ఏఐ కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు స్టార్టప్ కంపెనీలతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఈ పథకాన్ని తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ఆయన సూచించారు. పశువుల ఆరోగ్య సమాచారం, రోగ నిర్ధారణ కోసం ఈ కార్డులు ఉపయోగపడతాయని తెలిపారు. అలాగే కోళ్ల వ్యాధుల ముందస్తు గుర్తింపుకు ప్రత్యేక మొబైల్ యాప్ అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
తెలంగాణకు వర్ష సూచన!
భారత వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ తీరాన్ని ఇప్పటికే తాకాయి. ప్రస్తుతం ఇవి చురుకుగా కదులుతున్నాయి. ఈ నెల 27వ తేదీ నాటికి కేరళ తీరాన్ని చేరే అవకాశం ఉంది. జూన్ 12వ తేదీ వరకు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశముంది.ఈసారి తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఉష్ణోగ్రతల ప్రభావం రాబోయే వారం రోజుల్లో తగ్గనుంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వంగ ధర బోర్లా పడింది!
బొబ్బిలి, రామభద్రపురం ప్రాంతాల్లో వంగ ధర ఒక్కసారిగా బోర్లా పడిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. గతేడాది కిలో రూ.20 ఉండగా, ఇప్పుడు కేవలం రూ.3కు పడిపోవడం రైతులకు తీవ్ర నష్టం తెచ్చిపెట్టింది. రవాణా ఛార్జీలు కేటుకు రూ.50 పడుతుండగా, మార్కెట్లో ధర మాత్రం చాలా తక్కువగా ఉండడం వల్ల రైతులు దోపిడీకి లోనవుతున్నారు. గతేడాది 200 ఎకరాల్లో సాగు చేసిన వంగను, ఈసారి 450 ఎకరాలకు పెంచడంతో, ఇతర ప్రాంతాల్లో కూడా సాగు పెరిగింది. దీంతో రవాణా కూడా 50 శాతానికి తగ్గింది. నిల్వ సామర్థ్యం లేక రైతులు అడిగిన తక్కువ ధరకే పంట అమ్మకానికి వెనకాడలేక పోతున్నారు. 50 సెంట్లలో రూ.40 వేలు పెట్టుబడి పెట్టి పండించిన వంగ, మొత్తం రూ.10 వేలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ట్రంప్ సుంకాలతో మామిడి ఎగుమతులపై పడనున్న భారం !!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన 26% ప్రతీకార సుంకాలు భారతీయ మామిడి ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని మామిడి రైతులు ఈ ఎగుమతులపై కొత్త కష్టాలను ఎదుర్కొంటున్నారు. మామిడి పండ్ల ఎగుమతులు ఈ సుంకాల పెంపుతో తగ్గిపోతున్నాయి. ఇండియా మొత్తం మీద 7,64,500 ఎకరాల్లో మామిడి సాగుతూ, ఏటా 24,45,900 టన్నుల ఉత్పత్తి అవుతున్నాయి. అందులో 45,000 టన్నుల మామిడి అమెరికాకు ఎగుమతవుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 10,000-15,000 టన్నులు అమెరికా ఎగుమతవుతుంది. ప్రస్తుతం ఈ ఎగుమతుల విలువ రూ.150-230 కోట్లు, కానీ ట్రంప్ సుంకాల కారణంగా ధరలు రూ.50 కోట్లు పెరిగే అవకాశముంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వరంగల్ మార్కెట్‌లో బంగినపల్లి మామిడికి రికార్డు ధర!
వరంగల్ ఎనుమాముల ముసలమ్మ కుంటలో గురువారం ప్రారంభమైన నూతన మామిడి మార్కెట్‌లో తొలి రోజే బంగినపల్లి మామిడి రికార్డు ధర సాధించింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్లకు చెందిన రైతు విజయపాల రెడ్డి తీసుకువచ్చిన బంగినపల్లి మామిడిని టన్నుకు రూ.1.22 లక్షలకు కొనుగోలు చేశారు. మార్కెట్ చరిత్రలో మామిడికి ఇంత గరిష్ట ధర నమోదు కావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
తేనే టీగల పెంపకంపై శిక్షణ కార్యక్రమం
NBB మరియు NBHM ఆద్వర్యంలో ప్రొఫెసర్ జయ శంకర్ యూనివెర్సిటి రాజేంద్రనగర్ లో 10-02-2025 నుండి 15-02-2025 వరకు శాస్త్రీయ తేనే టీగల పెంపకంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్ ఉచితం. భోజనం మరియు వసతి ఉచితంగా కల్పించబడును. తేనే టీగల పెంపకం గురించి తెలుసుకోవాలనుకునే రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
టమాటా ధర భారీగా పతనం
టమాట పంటతో రైతులకు కష్టాలు తప్పట్లేదు. తాజాగా మెదక్ నర్సాపూర్ లో ఒక రైతు 2 ఎకరాల్లో 7,500 K G ల టమాటా పంటను దున్నేసి కాల్చేశారు. కిలో 2/- ఉండటంతో కూలీ కర్చులు కూడా రావట్లేదని వాపోతున్నారు. కర్నూల్ జిల్లాలో టమాటా కేజీ కి పడిపోయింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు!
అధిక ఆదాయాన్నిచ్చే ఆయిల్పామ్ సాగును ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తుంది . మొక్కలకు 90శాతం సబ్సిడీ, డ్రిప్కు ఎస్సీ ఎస్టీలకు 100శాతం, బీసీలకు 80శాతం, నాలుగేళ్ల వరకు నిర్వహణకు ఎకరాకు రూ.4.200 అందిస్తుంది. నాలుగు సంవత్సరాల నుండి పంట దిగుబడి మొదలై 35 సంవత్సరాల వరకు వస్తుంది. ఈ పంటకు చీడపీడల బాధ తక్కువే, అధిక వర్షాలను కూడా తట్టుకుంటుంది. ఎకరాకు 8 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుంది.